Tuesday, August 14, 2007

నా విశాఖ....

మాస్టారూ, మీరు ఉన్న ఊరు అందంగా ఉండుంటే , ఆహ్లాదం అందిస్తే, ఆనందం దోశిళ్లతో పంచుతుంటే... మీరున్నది విశాఖపట్నం లోనే కదా.. కాకపోతే నామాట విని ఒక్కసారి చూసిరండి మూడేళ్లు ....... చాలా బిరుదులివ్వాలని ఉంది, ఓ సుందర నగరమని ,ప్రకృతి అందాల కలబోతని, ...అలా అలా, విశాఖ, పేరు వింటేనే ఏదో తెలియని ఆనందం, ఎన్నో తీపి గురుతులు, విశాఖ లో ఉండికూడా ఎవరైన బోర్ గా ఉందన్నాడు అంటే మనసు లేని మనిషి అనాలేమో, అలా బీచ్ రోడ్ లో నడుస్తూ యుగాలు గడపాలనుంటుంది, కైలాసగిరి టైటానిక్ వ్యూ నుంచి తెన్నేటి పార్క్ ని చూడాలని, కైలాసగిరి మెట్లపైనుంచి చూస్తే, చీకటి పడే వేళ, ఎగిసిపడుతున్న అలలతొ కబుర్లు చెప్తున్న కొన్ని వందల నియన్ ల్యాంప్ లను పలకరించాలని ..... ఋషికోండ, యారాడ... ఇన్ని విశేషాలు ఒకేచోటా.. కొత్త వాళ్ళను స్వాగతిస్తూ, పాత వాళ్ళను పలకరిస్తూ... ఈవెంట్ ప్రొగ్రామ్స్, మస్తీ, ..పేరు ఏమైతేనేం సాయంత్రం కాగానే సరదా పరదాలు చుట్టూ కమ్మేసి .... ఏ మలిఝాముకో మేలుకువస్తుంది కళభారతి , కళాక్షేత్రం ...కళ తెలియనివాడికి అన్నప్రాసన, తెలిసిన వాడికి మస్తు భోజనం... ఐనా ఎంత చదివినా రాసినా ఆ ఆనందం రాదు, రాబోదూ... నా మాట విని ఒక్కసారి వెళ్లిరండి మాస్టారూ..

4 comments:

Lavanya said...

Ur explanation about vishakha is nice one..
i hav been to visaka once..enjoyed the beach.

even i am also new to blog.
visit my blog at http://yourslavanya.blogspot.com

Dr. Pavan K. Narayanam said...

ధన్యవాదాలు, మీ ప్రోత్సాహం మరికొన్ని వ్రాయటానికి ఉత్సాహం కలిగిస్తుంది. మీ బ్లాగ్ లో మీరు రాస్తున్న మాటలు ప్రేరణ కలిగిస్తున్నాయ్ --- పవన్

Unknown said...

మీ బ్లాగు బాగుందండి.

దీనిని జల్లెడకు కలపడం జరిగినది
www.jalleda.com

జల్లెడ

విహారి(KBL) said...

బ్లాగు బాగు నాకు విశాఖ అంటే చాలా ఇష్టం.