
ఈ మధ్య చూసిన సున్నితమైన మరియు భావోద్వేగాలతో కూడిన చిత్రం. ఇది ఆ చిత్రానికి రివ్యూ కాదు. కేవలం నాకు నచ్చిన, నచ్చని సన్నివేశాలు పంచుకోవాలని మాత్రమే.
మామూలు సినిమా భాషలో చెప్పాలంటే తనదైన లోకంలో జీవించే ఓ రాజపుత్ర వనితగా, పరిస్థితులు అనుకూలించనప్పుడు కూడా తన ఆత్మ గౌరవం వీడని ఇల్లాలిగా, ఒక్కసారి ప్రేమ పెంచుకున్న తర్వాత అక్బర్ ప్రేమిక పాత్రలో ఎంతో అందంగా, సున్నితంగా ఎపుడూ చూడని ఐశ్వర్యను చూపించాడు దర్శకుడు. స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న పట్టు తర్వాత చూపించలేక పోవటంతో సినిమా చివరకి జోధ పాత్ర బేలగా మిగిలిపోతుంది.
ఉన్నట్లుండి జోధా తండ్రి ఇక ఏదారి లేనట్లుగా తన కూతురిని అక్బర్ కి ఇచ్చి చేయాలనుకోవటం నేనయితే జీర్ణించు కోలేకపోయాను. ఆ విషయంలో ఎంత మహారాజు అయిని కనీసం తన భార్యతో కూడా చర్చించినట్లు అనిపించదు . ఏం చేస్తాం ఆ కాలమే అంతేనేమో. ప్రజల కోసం తప్పదనుకుంటే సంధి చేసుకోవచ్చు, అక్బర్ అడిగింది కూడా అదే, లేదు తన కూతురిని కూడా అడగకుండా వెళ్లి మీకిచ్చిపెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పటం!! చరిత్ర కదా, జరిగి ఉండవచ్చు,మనం మార్చలేము కూడా, ఇది అల్లిన కారణం అయి ఉంటే మాత్రం బాడ్ ఐడియా. ఇదే స్టొరీని సోషల్ బాగ్రౌండ్ లో అయితే వందలసార్లు చూసిన ఫార్ములానే , ఇంత పెద్ద సెట్టింగులు అవసరం లేని స్టోరినే.
ఈ సినిమాలో అక్బర్ పాత్రకు ఉదారతను ఎక్కువగా ఆపాదించే దారిలో పాత్ర బలహీనమయింది, మొదట రాజపుత్రరాజుని చంపకుండా వదిలినప్పుడు హర్షించే ప్రేక్షకులు చివర తన సోదరి భర్త అన్న కారణం గా వదిలిపెడ్తున్నానని శరీఫుద్దిన్ తో అన్నపుడు అంగీకరించలేరు. కత్తి యుద్దాలు మాత్రం సినిమాకు ప్రాణం పోశాయనే చెప్పాలి. ఐశ్వర్య పాల్గొన్న ప్రతి యుద్దంలో స్తంభాలపై పడ్తున్న కత్తి దెబ్బలు నాకైతే ఇంత కసిగా చేస్తారా ఫ్రెండ్లీ యుద్దమైనా అన్పించింది.
అక్బర్ పాత్రకు హృతిక్ మాత్రమే సరిపోతాడా అన్నంతగా చేసాడా రోల్ ని. ఇంట్రడక్షన్ లో ఏనుగు తో ఫైట్ సినిమా కి ఎస్సెట్ .ఈ సినిమాలో అక్బర్, జోధా ల మధ్య లవ్ సీన్స్ కొత్త ఫీల్ ఇస్తాయి. జోధా మనసు గెల్చుకోవటానికి అక్బర్ చేసాడనిపించేలా మరి కొన్ని సీన్స్ చేసుంటే సినిమాకి ఊతమిచ్చేవి. ఆగ్రా రాను రాను అంటున్న ఐశ్వర్య సడెన్ గా ఎందుకు తిరిగి వచ్చిందో అర్థం కాలేదు. ఐతే తీర్థ యాత్ర పన్ను తీసేసాడు కాబట్టి హాపీగా ఫీల్ అయి వచ్చిందని సంతృప్తి పడ్డాను. అంతలోనే ఇంకో డౌట్ వచ్చింది, వదిలిపెట్టి వెళ్లి పోయాడని భయంతో రాలేదు కదా అని?? నాకైతే దర్శకుడు క్లైమాక్స్ ని బలంగా అల్లలేదని అన్పించింది. అక్బర్ లాంటి చక్రవర్తికి శత్రువులకు కొరవా? ఎన్నో పాత్రలు దొరుకుతాయి, గొడవ చేసే జనాలు ఎలాగు చేస్తారు, సినిమా మరింత హిట్ అయ్యేలా చరిత్ర వాడుకొని వుంటే బాగుండేది.
నేను చదివిన చరిత్రలో ఐతే రాజులకు , రాణులకు పెద్ద పెద్ద భవంతులు ఉండేవనీ, కోటలు చాల పెద్దవనీ చదివినట్లు గుర్తు. ఈ సినిమా చూసాక అంతా ఒక ఇంట్లోనే ఉంటారని తెలిసింది, జోధ పాట పాడగానే దర్బార్ లో వున్నా రాజుగారు విని పరవశించేంతగా , రాణీగారు ఎవర్నో కలవటానికి వస్తే రాజుగారు గమనించగలరు కూడా, కోటలో చొరబడ్డ ఎవరైనా చాల వీజీగా గుర్రంఫై పారిపోవచ్చు, తిరిగి రావచ్చు .... సెట్టింగులు, డ్రెస్ డిజైన్ మాత్రం కళ్లు తిరిగేలా ఉన్నాయి, ఆ రేంజ్ లో హిందీ వాళ్లు మాత్రమే చేయగలరేమో.
ఫస్ట్ హాఫ్ చూసి తిండి మానేసి సెకండ్ హాఫ్ చూద్దామనుకున్న నేను సినిమా పూర్తయేసరికి అరే! తినేసి చూసిన సరిపోయేదే అనుకున్నా !!
1 comment:
నేనూ చాలా ఎక్స్పెక్ట్ చేసేస్కుని చూసాను. అయ్యో అనిపించింది. సినిమాలో చాలా పేలవంగా అనిపించింది. హిందీ వాళ్ళు బాగా తీయగలరు.. అంటే పాత ముఘల్-ఎ-ఆజం చూడాలి..లేదా పాకీజా చూడాలి. సెట్లు, కాస్ట్యూంస్, పాటలూ, డాన్స్లూ ఇంకా ముఖ్యంగా పాత్రలూ బావుంటాయి. నేనూ జోధా-అక్బర్ హాలీవుడ్ స్థాయిలో వుంటుందనుకున్నా. కానీ అక్కడక్కడా తప్ప మొత్తంగా నాకు నచ్చలేదు. మీరు ఉదహరించిన సన్నివేశాలతో పాటూ.. చాలా మంది పాత అశుతోష్ పాత సినిమాల్లో చూసిన నటుల్నే రిపీట్ చెయ్యటం, అక్బర్ ఈ సినిమా లో చాలా మామూలు రాజు లాగా..కనిపించటం, పాత్రల్లో ఒక రిజిడిటీ ఉండకపోవటం సినిమా కు పెద్ద నప్పలేదు. కానీ ఈ మామూలు సినిమాని బడ్జెట్ చూపించో, తారా గణాన్ని చూపించో ఆస్కార్ కి అఫీషియల్ ఎంట్రీ గా పంపిస్తారేమో అని భయంగా ఉంది.
Post a Comment